
రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్న గణేష్ నవరాత్రులలలో భాగంగా వివిధ రోజులలో భక్తులు జరుపుతున్న నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు సుమారు 11మంది స్వర్గస్థులు అయినందుకు బాధను వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు, అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గారు తమ సంతాపం తెలిపారు. మండప నిర్వాహకులు, భక్తులు పోలీసు అధికారుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తగా నిమజ్జనాలు పూర్తి చేయాలని అందరినీ కోరారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు మరిన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుని, మండప నిర్వాహకులకు తగు అవగాహన కల్పించాలని, భక్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు.
నిమజ్జనాలలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని శ్రీ గంగరాజు గారు, శ్రీ ఆంజనేయులు గారు ఒక ప్రకటనలో కోరారు.
అత్యంత భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తున్న భక్తులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మిగిలిన రోజులలో ముఖ్యంగా ఈనెల 4వ తేదీన జరిగే సామూహిక నిమజ్జన సమయంలో ఇటు భక్తులు అటు ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకోవాలని సమితి కోరింది.






