
అక్రమ ఆయుధాలను కలిగి ఉండడం, అశ్లీలతను వ్యాప్తి చేయడంతో పాటుగా మతమార్పిడి చేస్తున్నారన్న నేరారోపణలపై ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా జీనత్ మసీద్ ఇమామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈథ విషయంపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ అతుల్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఒక బాధిత బాలిక మసీదు మాజీ ఇమామ్ రహీం అహ్మద్ గది వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిందని, అందులో ఇమామ్ ఒక మహిళతో, అక్రమ ఆయుధాలతో మరియు అశ్లీల వస్తువులతో కనిపించారని తెలిపారు. ఈ విషయంలో, సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ మత మార్పిడి నిషేధ చట్టం, సెక్షన్ 66 ఐటీ చట్టం, అశ్లీలతను వ్యాప్తి చేయడం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో, సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఈరోజు అజిమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్చాయ్ కుంహారియా గ్రామ నివాసి ఇమామ్ రహీం అహ్మద్‌ను అరెస్టు చేశారు.
అంతేకాకుండా అరెస్టు చేసిన ఇమామ్ నుంచి 2 12 బోర్ పిస్టల్స్, 4 కార్ట్రిడ్జ్‌లు మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ASP తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నారు.
ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో, చంగూర్ అలియాస్ జలాలుద్దీన్ ఒక బాలికను బలవంతంగా మతమార్పిడి చేసిన కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. చంగూర్ దర్యాప్తులో, పోలీసులు అక్రమ మతమార్పిడులు, విదేశీ నిధులు , రూ.100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తుల అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను వెల్లడించారు. ప్రస్తుతం చంగూర్ జైలులో ఉన్నాడు. ఇప్పుడు రాంపూర్ జిల్లాలో ఇమామ్ రహీంను అరెస్టు చేశారు. అతని దర్యాప్తులో కూడా అనేక విషయాలు వెల్లడి కానున్నాయి.





