News

14న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం

21MðSMðSyìl181: íßæ…§ýl* ¯éÅĶæ$Ðé§ýl$Ë «§ýlÆý‡Ã çÜÐól$Ãâ¶æ¯]l… ´ùçÜtƊ‡¯]l$ BÑçÙPÇçÜ$¢¯]l² A¿ýæÄŒæ$ íßæ…§ýl* õܯ]l Ð]lÅÐ]lÝë¦ç³MýS$Ë$ Æ>«§é Ð]l$¯øçßæÆŠæ §é‹Ü ÝëÓÒ$i .
252views

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14న స్వామీజీల ఆధ్వర్యంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరుగుతుందని అభయ్ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో ఆ సమ్మేళనం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలు, మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు, అన్నదాన సత్రాల ఆస్తులు స్వార్థపరుల కబంధ హస్తాల్లో చిక్కుకుని అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలపై ధర్మ పోరాటానికి హిందూ లాయర్ ఫోరమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వామీజీలు, హిందూ న్యాయవాదులు ఏకమై అన్యాక్రాంతమైన ఆస్తుల పరిరక్షణకు న్యాయ, ధర్మ ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో న్యాయవాదులు శ్రీనివాసరాజు పాల్గొన్నారు