News

తిరుమలలోని మఠాల్లో భద్రతా చర్యలు

136views

తిరుమల భద్రత నిమిత్తం పోలీసుశాఖ తిరుమల తిరుపతి దేవస్థానం -టిటిడి విభాగాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు ప్రైవేటు మఠాల్లోనూ భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తిరుమలలోని దాదాపు 33 మఠాల్లో మెటల్‌ డిటెక్టర్ల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటుకు దిశానిర్దేశం చేయగా మఠంలోకి ప్రవేశించే వ్యక్తులు, వస్తువుల తనిఖీకి పరికరాలు అందుబాటులో ఉంచారు. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వాటి డేటాను భద్రపరిచే ఏర్పాట్లు చేసుకున్నారు. అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయ్‌శేఖర్‌ పర్యవేక్షణలో పోలీసుశాఖ చేసిన సూచనలను మఠాల నిర్వాహకులు ఆచరణలోకి తీసుకువచ్చారు. అన్ని భద్రతా దళాలు, టీటీడీ విభాగాల సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల మ‌నోభావాలను కాపాడట‌మే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.