News

జాతి పునర్ నిర్మాణంలో ఏబీవీపీ పాత్ర కీలకమైంది : కేంద్ర మంత్రి

210views

విద్యా వ్యవస్థ మరియు దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఏబీవీపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అయిన ఏబీవీపీ, దేశ నిర్మాణంలో విద్యార్థుల ప్రమేయాన్ని పెంపొందించడానికి మరియు నిర్మాణాత్మక విధానాన్ని ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేస్తోందన్నారు. అనేకమంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తలేనన్నది ఈ సంస్థ అందించే గొప్ప నాయకత్వానికి నిదర్శనమని తెలిపారు.

యువశక్తికి సరైన మార్గాన్ని చూపించే ఏబీవీపీ సేవలు అభినందనీయమన్నారు. జాతి పునర్ నిర్మాణంలో ఎబివిపి పాత్ర చాలా కీలకమైందని చెప్పారు. విద్యా రంగంలో సమస్యలతో పాటు సామాజిక రంగాల్లో విద్యార్థి పరిషత్ చేస్తున్న కృషిని అభినందించారు.వికసిత భారత్ లక్ష్యం లో కూడా ఎబివిపి పాత్ర ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో విద్యార్థి ఉద్యమంలో ఎబివిపి అలుపెరుగని పోరాటం చేస్తోందని మంత్రి వివరించారు.