
భారత భద్రతా బలగాలు నేపాల్ లో జరిపిన ఓ ప్రధాన ఆపరేషన్ లో విజయం సాధించాయి. అక్రమ సరఫదారు అయిన షేక్ సలీమ్ (సలీం పిస్టల్) ను అరెస్ట్ చేశారు.ఇంటెలిజన్స్ సమాచారం ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్, భద్రతా సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి. మన దేశంలో తొలిసారిగా గ్యాంగ్ స్టర్లకందరికీ జిగానా పిస్టల్ ను సరఫరా చేసింది సలీమే అని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సలీం పిస్టల్ గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ నుండి అధిక నాణ్యత గల ఆయుధాలను దిగుమతి చేసుకుని లారెన్స్ బిష్ణోయ్, హషీం బాబా మరియు అనేక ఇతర గ్యాంగ్‌స్టర్లకు సరఫరా చేస్తున్నాడు.అతను పాకిస్తాన్ నిఘా సంస్థ ISI మరియు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం యొక్క D కంపెనీతో కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ తో ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఇంటెలిజెన్స్ పేర్కొన్నాయి.
సిద్ధూ మూసేవాలా హత్య కేసు, బాబా సిద్ధిఖీ హత్య కేసుతో సహా అనేక పెద్ద నేరాలలో సలీం పిస్టల్ పేరు వచ్చింది. మూసేవాలా హత్య కేసులోని నిందితులలో ఒకరికి మెంటర్ గా కూడా పనిచేస్తున్నాడు.
చెడు వ్యక్తుల సహవాసం కారణంగా సలీం మొదట వాహనాలను దొంగలించడం ప్రారంభించాడు. 2000 లో మొదటి సారిగా వాహనాల దొంగతనం కేసులో పట్టుబడ్డాడు. దీని తర్వాత ఆయుధాల దోడీ, కోట్లకు విలువైన వస్తువుల దోపిడీలో కూడా అరెస్ట్ అయ్యాడు.2018లో ఢిల్లీలో అరెస్టు అయిన తర్వాత, సలీం విదేశాలకు పారిపోయి అక్కడి నుంచి ఆయుధ సరఫరా నెట్‌వర్క్‌ను నిర్వహించడం ప్రారంభించాడు. అతను నేపాల్‌లో దాక్కున్నాడని పోలీసులకు సమాచారం అందింది, ఆ తర్వాత ఏజెన్సీలు అతన్ని గుర్తించి పట్టుకున్నాయి.
సలీం పిస్టల్ నెట్‌వర్క్ భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉంది. అతను పాకిస్తాన్ నుండి ఆయుధాలను దిగుమతి చేసుకుని నేపాల్ మరియు ఇతర సరిహద్దు ప్రాంతాల ద్వారా భారతదేశానికి సరఫరా చేసేవాడు.అతని సరఫరా జాబితాలో పిస్టల్స్, కార్బైన్లు మరియు ఇతర అధునాతన ఆయుధాలు ఉన్నాయి.




