
భక్తులు విగ్రహాలకు పూజలు చేయడం సాధారణంగా చూస్తుంటాం. ఇక్కడ మాత్రం మరణ శాసనానికి ప్రణమిల్లుతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ రాణి రుద్రమ మరణ వివరాలు తెలిపే అత్యంత అరుదైన శిలాశాసనం మట్టిలో కూరుకుని ఉండటంతో దీన్ని 17ఏళ్ల క్రితం గ్రామ యువత పరిరక్షించింది. పురావస్తు శాఖ సహకారంతో శాసనానికి గద్దె నిర్మించారు. కాకతీయ రాణి రుద్రమ, ఆమె సైన్యాధిపతి మల్లికార్జుననాయుడు శక సంవత్సరం 1211 (క్రీ.శ 1289) విరోధినామ సంవత్సర మార్గశిర శు.12(ద్వాదశి) శుక్రవారం (నవంబరు 27)వీరమరణం పొందినట్లు శాసనంలో ఉంది. ఏటా నవంబరు 27న గ్రామస్థులు రుద్రమ వర్ధంతిని నిర్వహిస్తూ ఈ శాసనానికి పూజలు చేస్తారు. పేదలకు దుప్పట్లు, దుస్తులు.. వృద్ధులకు పండ్లు పంపిణీ చేస్తారు. గ్రామ వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో ఎస్‌బీఐ సహకారంతో ఇక్కడ 10 అడుగుల రాణి రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మా





