News

‘‘ప్రభుత్వ వాహనం’’ అని రాసి, గోవులను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా

221views

ఒడిశాలో గోవుల అక్రమ రవాణా నిరంతం పెరిగిపోతోంది. రాత్రిపూట కూడా స్మగ్లర్లు స్థానిక రోడ్లపై వుండే ఆవులను కూడా దొంగలిస్తున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే ఎవ్వరికీ అనుమానాలు రావొద్దని తమ ప్రైవేటు వాహనాలపై ప్రభుత్వ వాహనాలు అని రాస్తూ, ఏదో శాఖ పేరు కూడా రాసేసి, ఎవ్వరికీ అనుమానాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. స్మగ్లింగ్ ను వ్యవస్థీకృతంగా చేస్తున్నారన్న దానిలో ఇదో భాగమైంది.

అయితే కెండుఝర్ జిల్లాలో ఇలాంటి కేసే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో బొలేరో వాహనం నుంచి రెండు ఆవులను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అందులోంచి ఓ ఆవు అక్కడికక్కడే మరణించింది. మరొకటి తీవ్రంగా గాయపడింది.

ఈ ప్రాంతంలో విపరీతమైన గనులున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కూడా. దీంతో వాహనాల రద్దీ ఎక్కువగానే వుంటుంది. రాత్రి పెట్రోలింగ్ సమయంలో ఇదే ప్రాంతంలో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలోనే బొలేరో వాహనాన్ని పోలీసులు గమనించారు. ఇంతలోనే డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులకు అనుమానాలు వచ్చి తనిఖీ చేయగా, అందులో గోవులు బయటపడ్డాయి. గాయపడిన ఆవును చికిత్స కోసం పశు వైద్యశాలకు పంపగా, చనిపోయిన ఆవును పోస్టుమార్టం కోసం తరలించారు.

వాహనంపై ఆర్థిక శాఖ అంటూ రాతలు..
తాము చేస్తున్న గో స్మగ్లింగ్ గురించి ఎవ్వరికీ అనుమానాలు రావొద్దని తమ వాహనాలపై ప్రభుత్వ వాహనం అని స్మగ్లర్లు రాయిస్తున్నారు. కేవలం ప్రభుత్వ వాహనం అని కాకుండా, ఏదో ఒక శాఖ పేరు రాసి, గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ బొలేరో వాహనంపై ఇలాగే ‘‘ఆర్థిక శాఖ’’ అని రాసి వుంది.మరోవైపు దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.