
ఆగ్రా మత మార్పిడి కేసులో కీలక నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ ను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. మత మార్పిడి కోసం అబ్దుల్ కి విదేశీ నిధులు అందుతున్నాయని, వాటికి సంబంధించిన వారితో సంబంధాలున్నాయని తేల్చేశారు. అబ్దుల్ రెహ్మాన్ మేనల్లుడు లండన్ లో వుంటున్నాడు. అక్కడి నుంచే ఈ మత మార్పిడి ముఠాకి ఆర్థిక సాయం అందుతోంది. దీనిని ఆధారంగా చేసుకొనే ఏటీఎస్, ఇంటెలిజెన్స్ బృందాలు ఢిల్లీ, కలకత్తాలో దాడులు నిర్వహిస్తున్నాయి.
ఆగ్రా కేంద్రంగా భారీ మొత్తంలో జరిగిన మత మార్పిడి రాకెట్ లో అబ్దుల్ రెహ్మాన్ పాత్రే కీలకం. ఏటీఎస్ ప్రత్యేక బృందం రెహ్మాన్ నివాసంలో సోదాలు చేశారు. మత మార్పిడి కోసం ఉపయోగించే సాహిత్యం, ఇతరత్రా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫిరోజాబాద్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్, మహేంద్ర పాల్‌గా జన్మించాడు. అతను మొదట క్రైస్తవ మతంలోకి, తరువాత ఇస్లాం మతంలోకి మారాడు.
అక్రమ మత మార్పిళ్లు, రాడికలైజేషన్ విషయంలో యూపీ పోలీసులు పెద్ద విజయాన్ని సాధించారు. ఈ రెండింటికీ సంబంధించిన ముఠాను ఛేదించారు. ఈ ముఠా అచ్చు ఐసిస్ తరహాలోనే పనిచేస్తుందని పోలీసులు ప్రకటించారు. అక్రమ మత మార్పిళ్లు చేస్తున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. అరెస్టైన వారు ఆరు రాష్ట్రాలకు సంబంధించిన వారు. ఇందులో ఓ మహిళతో పాటు ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవాకి సంబంధించిన వారిగా పోలీసులు తెలిపారు.అరెస్టైన వారిలో ఆయేషా అలీహసన్, ఒసామా, రెహ్మాన్ ఖురేషీ, అబ్బుతాలిబ్, అబుర్ రెహ్మాన్, ముస్తఫాతో పాటు మహ్మద్ అలీ, జునైద్ ఖురేషీ గా గుర్తించారు.
మార్చి మాసంలో ఆగ్రాలో ఇద్దరు మహిళలు తప్పిపోయినట్లు ఫిర్యాదు నమోదైంది పోలీస్ స్టేషన్ లో. దీని తర్వాత పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తేలింది ఏమిటంటే.. వారిద్దర్నీ బలవంతంగా మతం మార్చేసి, ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
అంతేకాకుండా ఇందులోని ఓ అమ్మాయి AK47రైఫిళ్లు పట్టుకున్నట్లు ఓ ప్రొఫైల్ ను కూడా అక్రమ మత మార్పిడి ముఠా తయారు చేసి, అప్ లోడ్ చేసింది. ఈ విషయాన్ని ఆగ్రా పోలీస్ కమిషనర్ వెల్లడించారు. వీరిద్దర్ని అక్రమ మత మార్పిడి ముఠా, లవ్ జిహాద్ ముఠా ముందుగానే టార్గెట్ చేసిందని, ముందస్తు ప్రణాళికా ప్రకారమే ఇస్లామిక్ మత మార్పిడి చేసేసి, రాడికలైజేషన్ వైపు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు.
కెనడా నుంచి కూడా నిధులు..
ఈ ముఠాకి సంబంధించి మరో విషయాన్ని కూడా పోలీసు కమిషనర్ ప్రకటించారు. ఈ ముఠాకి అమెరికా, కెనడా సహా వివిధ దేశాల నుంచి నిధులు కూడా అందుతున్నాయని ప్రకటించారు. ఈ నిధుల ద్వారా అక్రమ మత మార్పిళ్లు, రాడికలైజేషన్ వైపు అమ్మాయిల్ని మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. నిధులకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తాము సేకరించామని ప్రకటించారు.
అరెస్టైన వారు ఈ నెట్ వర్క్ లో వివిధ పాత్రలు పోషిస్తారని, అక్రమ నిధులను సేకరించడం, సమకూర్చడం, న్యాయ సలహాలు, మత మార్పిడి ప్రక్రియ, ఇస్లామిక్ రాడికలైజేషన్ పద్ధతులు.. ఇవన్నీ చూస్తూ వుంటారని తెలిపారు. ఈ ముఠా అచ్చు ఐసిస్ తరహాలోనే వుంటుందని కూడా పోలీసులు పేర్కొన్నారు. అలాగే కేసు తీవ్రత నేపథ్యంలో దర్యాప్తులో సహాయం నిమిత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఏటీఎస్ తో పాటు ప్రత్యేక విభాగాలు కూడా పనిచేస్తున్నాయి.





