
శ్రావణమాసం పురస్కరించుకొని ఆర్టీసీ అధికారులు ‘హనుమాన్ దర్శన్’ యాత్ర పేరుతో బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.అనంతపురం జిల్లాలోని గుంతకల్లు మండలం కసాపురం, బొమ్మనహాళ్ మండలం నేమకల్లు, డి.హీరేహాళ్ మండలం మురడిలో వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆంజనేయస్వామి దేవాలయాలను ఒకేరోజు దర్శించుకోవచ్చు. ప్రతి శని, మంగళవారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సాధారణ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఈనెల 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 తేదీల్లో ఆయా డిపోల నుంచి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరితే సాయంత్రానికి మళ్లీ యథా ప్రదేశానికి చేరుకుంటాయి.
50 మంది కోరితే ఇంటికే బస్సు
కనీసం 50 మంది మూడు ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకుంటామని సంబంధిత డిపో మేనేజర్లను కోరితే నేరుగా గ్రామానికే బస్సును పంపుతారు. బయట గ్రామాల నుంచి దూరం లెక్కించి ఛార్జీ నిర్ణయిస్తారు. ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించారు. పూర్తి వివరాలకు సంబంధిత బస్సు డిపో, స్టేషన్ల మేనేజర్లను సంప్రదించాలని ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్ ఆర్.ఆదోని తెలిపారు.


