
267views
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారు, భారత పౌరసత్వంపై అనుమానం ఉన్నవారి చెరలో అస్సాంలోని 10 లక్షల ఎకరాల భూమి ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక గోరుఖుటీలో అక్రమ వలసదారులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా.. అంతర్జాతీయంగా ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. కానీ ప్రజలు అడ్డుకోలేదని వెల్లడించారు. గోరుఖుటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్‌లను నిర్వహింఛి 25,000 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణదారుల నుండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. “ఆక్రమణదారులు నుండి ప్రతి అంగుళం భూమిని తీసుకోవాలని సంకల్పించాము” అని ఆయన అన్నారు.





