News

వ్యాసాయ.. విష్ణురూపాయ!

185views

సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు.

భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆదిగురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.