News

భక్తి మార్గమే శరణ్యం

231views

భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువురు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్‌, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్‌, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.