News

కాకినాడ జిల్లాలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ

274views

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి శ్రీరమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి దేవస్థానంలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ, ఉపాలయాల్లో దక్షిణామూర్తి తదితర దేవతామూర్తుల ప్రతిష్ఠ సోమవారం కనులపండువగా జరిగింది. క్షేత్ర మండపంలోనే నాయనార్ల శిల, పంచలోహ విగ్రహాలను కొలువుదీర్చారు. అరుణాచల మాధవి, స్వామి రామానంద పర్యవేక్షణలో అర్చకులు ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాచపల్లిలో అరుణాచలేశ్వరుని ఆలయం ఆధ్యాత్మిక వారసత్వంగా నిలుస్తుందని స్వామీజీలు, ప్రముఖులు స్పష్టం చేశారు. నాయనార్ల విగ్రహాల ఏర్పాటు అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, గాయని ఎంఎం శ్రీలేఖ, సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.