
242views
అఖండ గోదావరి తీరంలో గోదారమ్మకు అందించే నిత్యహారతి వేడుక అపురూపం. రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో సాయంత్రం సమయంలో నిత్యం నదీమతల్లికి 14 రకాల హారతులు అందించి పూజలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2015 జులై 1న గోదావరి నిత్యహారతి వేడుక ప్రారంభించారు. నాటి నుంచి హారతి కార్యక్రమం తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. జులై 1 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ గోదావరి నిత్యహారతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుష్కరఘాట్‌లో శ్రీరుద్ర సహిత నవ చండీ పారాయణ పూర్వక చండీ సప్తశతి హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సంఘం ప్రతినిధులు తెలిపారు.




