News

నాగా తెగలకు చెందిన మానవ అవశేషాలను తిరిగివ్వండి..

169views

నాగా గిరిజన సమాజానికి చెందిన నాగ గిరిజన సంఘాలు, ఫోరమ్ ఫర్ నాగ సయోధ్య (FNR) రికవర్, రిస్టోర్ అండ్ డీకాలనైజ్ (RRaD) బృందం సభ్యులు, సీనియర్ నాయకుల ప్రతినిధి బృందం యూకేలో పర్యటిస్తోంది. బ్రిటిష్ పాలనలో నాగ తెగలకు చెందిన 200 కంటే ఎక్కువ మానవ అవశేషాలను సేకరించి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా వలస పాలనలో తీసుకెళ్లిన నాగ పూర్వీకుల మానవ అవశేషాలను తిరిగి ఇవ్వాలని ఈ ప్రతినిధి బృందం డిమాండ్ చేస్తోంది.

బ్రిటిష్ పాలనలో నాగాతెగకు చెందిన అవశేషాలలో చాలా వరకు 2020 వరకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని పిట్ రివర్స్ మ్యూజియం (PRM)లో ప్రదర్శించబడ్డాయి. ప్రపంచంలోని ప్రముఖ ఎథ్నోగ్రాఫిక్ మ్యూజియంలలో ఒకటైన పిట్ రివర్స్ మ్యూజియం ఇటీవలి సంవత్సరాలలో వలసరాజ్యాల యుగం నాటి మానవ అవశేషాలను తొలగించడం ప్రారంభించింది. ఈజిప్టు మమ్మీలు, కుంచించుకుపోయిన మానవ తలలను 2020లో ప్రదర్శన నుండి తొలగించారు. నాగా ప్రతినిధి బృందం చొరవ ప్రపంచ స్వదేశీ హక్కుల ఉద్యమంలో భాగం, దీనిలో గిరిజన వర్గాలు తమ పూర్వీకులను సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

శనివారం (14 జూన్ 2025) ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో నాగా ప్రతినిధి బృందం నాగా ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వారి అవశేషాలను తిరిగి స్వదేశానికి పంపాలని మేము ప్రయత్నిస్తున్నాం. దీనికి చాలా దశాబ్దాలు పట్టింది. అందుకు మేము చింతిస్తున్నాం. కానీ ఇప్పుడు మా పూర్వీకులను గౌరవంగా తమ స్వదేశానికి తిరగి తీసుకురావడానికి మేము కట్టుబడి ఉన్నామని ఓ ప్రకటన చేసింది. ఈ ప్రకటన నాగ తెగల ఐక్యతకు, అన్ని తరాలకు శాంతికి చిహ్నంగా పనిచేస్తుందని కూడా వారు చెప్పారు.
ఈ సందర్భంగా పిట్ రివర్స్ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ లారా వాన్ బ్రోఖోవెన్ నాగా ప్రతినిధి బృందాన్ని స్వాగతించారు..వారు మాట్లాడుతూ ఈ ప్రక్రియ వల్ల గతంలోని తప్పులను అంగీకరించి భవిష్యత్తులో సయోధ్య వైపు చూసే అవకాశం ఉందని వారన్నారు.