
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్ స్వామి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్ 08313 విశాఖ – పూరీ స్పెష ల్ (26న అర్ధరాత్రి దాటాక) ఈ నెల 27 నుంచి జూలై 5 వరకూ, తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08314 పూరీ – విశాఖ స్పెషల్ ఈ నెల 28 నుంచి జూలై 6 వరకూ నడుస్తుంది. జగదల్‌పూర్ – పూరీ – జగదల్ పూర్ స్పెషల్ ట్రైన్ నెంబర్ 08445 ఈ నెల 26 నుంచి జూలై 4వ తేదీ వరకూ, తిరుగు ప్రయాణంలో 0844 6 ఈ నెల 28 నుంచి జూలై 6వరకూ నడుస్తుంది. అదేవిధంగా రాయగడ – కురదారోడ్డు – రాయగడ స్పెషల్ ట్రైన్ నెంబర్ 08593 ఈ నెల 26 నుంచి జూలై 7వరకూ తిరుగు ప్రయాణంలో 08594 కుర్దారోడ్డు – రాయగడ స్పెషల్ ఈ నెల 28 నుంచి జూలై 6 వరకూ నడుస్తాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.





