News

ఆధునిక సమాజానికి సంస్కృతం దిక్సూచి కావాలి

149views

ఆధునిక సమాజానికి సంస్కృత జ్ఞానం దిక్సూచి కావాలని ఇందుకోసం ప్రతి విద్వాంసుడు నడుం బిగించాలని తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నాసిక్‌లో కేంద్ర సంస్కృత వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో ఉత్కర్ష మహోత్సవంతో ముగిసింది. కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ సంస్కృత భాషాభివృద్ధికి ప్రతి వ్యక్తి ప్రతినబూనాలని కోరారు.

ఆధునిక సమాజంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో భావిభారతానికి సంస్కృత ఔన్నత్యాన్ని చాటి చెప్పాలన్నారు. ఈ మేరకు ఉత్కర్ష మహోత్సవంలో రోడ్డమ్యాప్‌ తయారు చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం నిర్వాహకులు వీసీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలు సంస్కృత వర్సిటీల నుంచి అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.