
212views
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ రైల్వేస్టేషన్ పేరును మార్చినట్లు సెంట్రల్ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఉస్మానాబాద్ స్టేషన్ పేరును ధారాశివ్ గా మార్చినట్లు తెలిపింది. కొత్త స్టేషన్ పేరు, కోడ్ -UMD, DRSVలకు ఇండియన్ రైల్వేస్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆమోదం తెలిపినట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. మహారాష్ట్ర సర్కార్ 2023లో ఉస్మానాబాద్ జిల్లా పేరును ధారాశివ్ గా మార్చింది. ఈ పేరు మార్పును అమలు చేసేందుకు ముంబై ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ -PRS జూన్ 1 రాత్రి 11.25 గంటల నుంచి తెల్లవారుజామున 01.30 వరకూ టెంపరరీగా మూసివేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. కాగా.. ఉస్మానాబాద్ కు ఆ పేరు 20వ శతాబ్దపు హైదరాబాద్ రాచరిక రాష్ట్ర పాలకుడి పేరు మీద పెట్టినట్లు తెలుస్తోంది. ధారాశివ్ అనేది ఈ ప్రాంతంలోని 8వ శతాబ్దానికి చెందిన ఒక గుహ సముదాయం పేరు.





