
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఉగ్ర దాడి ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. అంతర్జాతీయ ముష్కర సంస్థ ఐసిస్‌తో ప్రభావితమైనట్టు అనుమానితులుగా ఉన్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం డీసీపీ ప్రమోద్ కుష్వాహా వెల్లడించారు. అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తులకు ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురినీ అసోంలోని గువాహటికి చెందిన ముఖ్దాస్ ఇస్లాం, రంజిత్ అలలీ, లూయిస్ జమిల్ జమాల్‌లుగా గుర్తించారు. బాంబుల తయారీలో వాడే పేలుడు పదార్థాలు, ఐఈడీలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో దాడులు జరపాలని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





