News

పాక్‌ను మోకాళ్ల మీద కూర్చోబెట్టాం: ప్రధాని మోదీ

77views

మన భద్రతా బలగాలు పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా గర్విస్తున్నారని రాజస్థాన్‌లోని బికనేర్‌లో మాట్లాడారు.

‘సిందూరం భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఏప్రిల్ 22న ఉగ్రదాడికి ప్రతిగా 22 నిమిషాల్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఉగ్రమూకలను మట్టిలో కలిపేశాం. నా సిరల్లో రక్తం కాదు సిందూరం ప్రవహిస్తోంది. పాక్‌లోని రహిమ్‌ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్ ఐసీయూలో ఉంది. అణుబెదిరింపులకు భారత్‌ ఇక ఏమాత్రం భయపడదు. పాక్‌తో ఎలాంటి వాణిజ్యం, చర్చలు ఉండవు. చర్చల మాట అంటూ వస్తే.. అది పాక్‌ ఆక్రమిత కశ్మీర్ గురించే. ఉగ్రదాడి జరిగితే.. పాక్‌ ఆర్మీ, ఆర్థికవ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనం స్పష్టంచేశాం. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్‌కు ప్రవహించదు. భారత ప్రజల జోలికివస్తే.. గట్టి గుణపాఠం తప్పదు’’ అని రాజస్థాన్‌ వేదికగా హెచ్చరికలు చేశారు.