
753views
ఢాకాలో టర్కిష్ ఎన్జీవో మద్దతు ఉన్న ఒక ఇస్లామిస్ట్ గ్రూప్ వివాదాస్పద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను ప్రదర్శించింది. అందులో భారత్‌కు చెందిన పలు తూర్పు, ఈశాన్య రాష్ర్టాలు తమ దేశంలో భాగమేనని ప్రకటించింది. ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం సల్తానత్-ఎ-బంగ్లా అనే గ్రూప్ ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌ను విడుదల చేసింది.
ఈ మ్యాప్‌లో మయన్మార్‌లోని ఆరకాన్ రాష్ట్రం, భారత్‌కు చెందిన బీహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు యావత్ ఈశాన్య రాష్ర్టాలు గ్రేటర్ బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. ఢాకాలోని పలు యూనివర్సిటీ హాళ్లలో, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ మ్యాప్ దర్శనమిస్తున్నది.