
తమిళనాడులోని కడలూరు జిల్లా బన్రూటి సమీపంలో సుమారు 8 వేల ఏళ్ల నాటి పురాతన రాతి పనిముట్లు లభ్యమైనట్లు పురావస్తు పరిశోధన శాఖ నిపుణులు తెలిపారు. కడలూరు జిల్లా దక్షిణ ప్రాంతంలో ఉన్న మరుంగూర్, పాలకొల్లై, వట్టప్పన్‌కుప్పం, భద్రకోత తదితర గ్రామాల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో విద్యార్థులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ తవ్వకాల్లో తాజాగా ఉళుందంపట్టు దక్షిణ పెన్నా నదితీరంలో లభ్యమైన రాతి పనిముట్టు ఎత్తు 2.5 సెం.మీ, పొడవు 2 సెం.మీ అని, దీంతో జంతువుల చర్మం ఒలిచేందుకు వినియోగిస్తుంటారు.
8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్టు గురించి పురావస్తు శాఖ పరిశోధకులు శివరామకృష్ణన్ మీడియాకు వివరిస్తూ… రాతియుగం నాటి ప్రజలు క్రూర జంతువులను వేటాడుతుండేవారని, వారు అప్పట్లో అందుబాటులో ఉన్న రాళ్లతో ఆయుధాలు తయారుచేసి వినియోగిచేవారని, ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా, పదునుగా ఉంటాయని తెలిపారు. ఈ అరుదైన పనిముట్లు తవ్వకాల్లో లభ్యమవుతున్నాయని, వీటిని భద్రపరిచేందుకు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.





