News

తిరుమల భద్రతపై కమిటీ సభ్యుల పరిశీలన

287views

తిరుమలలో భద్రతపై డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాలతో సెక్యూరిటీ ఆడిటింగ్‌ కమిటీ సభ్యులు ఐపీఎస్‌లు సునీత్‌ గరుడ, ఆరిఫ్‌ హాఫ్జ్‌లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి పరిశీలించారు. వీరు తిరుమల భద్రతకు కీలకమైన అలిపిరి తనిఖీ కేంద్రం, నడకమార్గం, శ్రీవారి పాదాలు, రెండు ఘాట్‌రోడ్లతోపాటు తిరుమలో హథీరాంజీ మఠం, శ్రీవారి ఆలయంలో బూందీపోటు, మాడవీధులు, అన్నప్రసాద కేంద్రం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1, ఔటర్‌ రింగ్‌రోడ్లు ప్రాంతాల్లో స్వయంగా పరిశీలన జరిపి సెక్యూరిటీ ఆడిటింగ్‌ నిర్వహించారు. గుర్తించిన అంశాలపై గురువారం పోలీసు, తితిదే విజిలెన్స్, ఆక్టోపస్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తిరుమలలో భక్తుల రక్షణ, భద్రతను మెరుగుపర్చేందుకు ఈ ఆడిటింగ్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయ్‌శేఖర్, తితిదే వీజీవో సురేంద్ర, అక్టోపస్, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.