
341views
కర్నాటకలోని కలబురగి పరీక్ష కేంద్రంలో నీట్ పరీక్షలకు హాజరైన విద్యార్థి జంధ్యం తొలగించిన వివాదంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ధార్మిక భావనలకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు పరీక్షకేంద్రం ఉద్యోగులు శరణగౌడ, గణేశ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని కలబురగి పోలీస్ కమిషనర్ ఎస్‌డీ శరణప్ప సోమవారం తెలిపారు. పరీక్ష జరిగిన తర్వాత శ్రీపాదపాటిల్ అనే విద్యార్థి స్టేషన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. జంధ్యం తొలగింపు ఘటనకు నిరసనగా కలబురగిలో బ్రాహ్మణ సంఘాలు ఆదివారం సాయంత్రం ఆందోళన చేశాయి.





