News

శబరిమలలో బంగారు లాకెట్‌ల విక్రయాల ప్రారంభం

412views

కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలు మొదలయ్యాయి. కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ పవిత్ర విషు పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడికి మొదటి లాకెట్‌ను అందజేశారు. శబరిమల ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్లను దేవస్థానం భక్తులకు విక్రయిస్తోంది. అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్‌ ధర రూ.19,300, నాలుగు గ్రాముల లాకెట్‌ ధర రూ.38,600, ఎనిమిది గ్రాముల లాకెట్‌ ధర రూ.77,200గా నిర్ణయించినట్లు టీడీబీ తెలిపింది.