News

చెంచు గూడేలలో దుప్పట్లు పంపిణీ చేసిన నంద్యాల సంఘమిత్ర

61views

ధునిక జన జీవనానికి దూరంగా కొండ కోనల్లో కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక అష్టకష్టాలు పడుతున్నారు నిజమైన భూమిపుత్రులు చెంచులు. ‘వనవాసీ కళ్యాణ్’ కార్యక్రమంలో భాగంగా వారి సేవలో తరిస్తున్నది కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర.

శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నల్లమల అటవీ ప్రాంతములో గల నలభై చెంచుగూడేలలో నిరంతరం వైద్యసేవలు అందించటం తోపాటు ఎప్పటికప్పుడు వారి అవసరాలను గమనిస్తూ తదనుగుణంగా సేవలందించటం విశేషం.

అందులో భాగంగా  ఏడీఇ  శ్రీ. శ్రీనివాసులు గారి సహకారంతో పాత మాడుగుల, జానాల గూడెం, బలపాల దిబ్బ మరియు సిద్దేశ్వరం గూడేలలో అక్కడి ప్రజలను చలి నుండి, భయంకరమైన అడవి దోమలనుండి రక్షించటానికి నంద్యాల సంఘమిత్ర వారు దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ , మొబైల్ డాక్టర్ శ్రీ యన్. సూర్యారావు, కర్నూలు జిల్లా ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ. రాంప్రసాద్, సంఘ కార్యకర్త శ్రీ రాజేష్ మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VAT ఆంధ్రప్రదేశ్ యాప్ ను డౌన్    లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.