News

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

229views

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున 3గంటలకు శ్రీవారి సుప్రభాతసేవతో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఉగాది ఆస్థానంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వార్ కి అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని వేంచేపు చేసి దక్షిణాభిముఖంగా సేనాధిపతిని కొలువుదీర్చి ఉగాది ఆస్థానాన్ని నిర్వహించారు. శ్రీవారి పాదపద్మాలమీద ఉన్న శ్రీవిశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని భక్తితో స్వీకరించి ఆస్థాన సిద్థాంతి స్వామివారికి నూతన పంచాంగ విశేషాలు వినిపించారు. ఉగాది సందర్భంగా మలయప్పస్వామి బంగారుపల్లకిపై ఊరేగుతూ భక్తులకు దర్సనమివ్వనున్నారు.ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.