News

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు

290views

దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్మృతి మందిరంలో జరిగే చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీడాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పించనున్నారు ప్రధాని మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోనూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.33 వేల కోట్ల విలువైన పథకాలను ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి ఆదివారం ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.

ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ చేరుకుంటారు. అక్కడ ఎన్‌టీపీసీ సిపత్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-3కి శంకుస్థాపన చేయనున్నారు. ఎనిమిది కిలోమీటర్ల పొడవు గల ఏడు రైల్వే ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 111 కిలోమీటర్ల పొడవు గల మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను అందించనున్నారు. ఈ పథకంలోని లబ్ధిదారులకు ప్రధానమంత్రి వారి ఇంటి తాళాలను అందజేయనున్నారు.