ArticlesNews

విశ్వ కల్యాణానికి హిందూ సంఘటన

354views

వర్తమాన శతాబ్దం- స్వామి దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అనిబిసెంట్, శ్రీరామ కృష్ణ పరమహంస,స్వామి వివేకానంద. రవీంద్ర నాథఠాకూర్, మహాత్మాగాంధీ వంటి మహనీయుల, ఆదర్శపురుషుల అవతరణ, కృషి ద్వారా ఒక మహ త్తరమైన ఆధునిక హైందవ ధర్మ పునరుద్ధరణను దర్శించింది. దీనితో పాటు హిందూ ధర్మం ఇస్లాం, క్రైస్తవ మతాల తీవ్రతర తాకిడిని కూడా ఎదుర్కొంటూ వస్తోంది. ఇందులో ఇస్లాం ఈ దేశాన్ని విభజించడం ద్వారా బలిగొనటంలో సఫలీకృతమయింది. క్రైస్తవోత్తేజితులైన విప్లవకారులు నాగభూమి, మిజోకొండ జిల్లాలలో మరింతగా దేశాన్ని అనైక్యత పాలు చేయటానికి యత్నిస్తున్నారు. విఘటనకు గురి చేస్తున్నారు. స్వాతంత్ర్యానంతరం భారత్లో తెల్లవారి విఘటనాత్మక దాడి ధోరణి తీవ్రతరమే అయింది. ఈ యత్నం బొంబాయిలో జరిగిన ‘యూకరిష్టిక్’ సమ్మేళనాలతో ఒక దృశ్యమానమైన ఉరవడిన అందుకొంది. విదేశీ మతాచార్యులు హరిజన, గిరిజనులను ‘పాల పొడి’ క్రైస్తవులుగా మతాంతరులను చేయటంలో నిమగ్నమై ఉన్నారు. చాలా ఆత్రుత పడుతున్నారు. ‘లౌకికవాదం'(సెక్యులరిజం)గా బహుళ ప్రచారం పొందుతున్న మన ప్రభుత్వ విధానం హైందవ వ్యతిరేకం’గా స్ఫురించబూనింది. భారతీయ జీవన ఆలోచనలు దేశంలో హిందూధర్మమే ఒక శతాబ్దం గడిచేసరికి అదృశ్యమౌతుందని- ఒక పెద్ద దేశ నాయ కుడు శ్రీ ప్రకాశ వంటి వ్యక్తి దీపావళి (1948) ‘ఆర్గనైజరు సంచికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.

పరిస్థితి భయానకమనీ సంతృప్తికీ, ఉపేక్షకూ ఎలాంటి అవకాశం లేదనీ స్పష్టం. అయితే అంత మాత్రాన భయం చెందవలసిన అవసరం గూడా లేదు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వహిందూ పరిషత్ల ఆవిర్భావం ఈ పరిస్థితులలో ఒక శుభసూచకంగా తోస్తోంది. హైందవ ధర్మానికి ఎదురైన ఈ సవాల్ను ఎదుర్కొని, వాటి పరిరక్షణకు ఎట్టి శ్రమకూ, త్యాగాలకైనా ఓర్చేందుకు ఈ రెండూ ధైర్యంగా బాధ్యతలు స్వీకరించాయి, మధ్యప్రదేశ్లో అక్కడి ప్రభుత్వ ఒత్తిళ్లతోనో, ప్రలోభాలతోనో ఆక్రమంగా మతాంతరీకరణలు చేయటాన్ని నిషేధిస్తూ ఒక ముసాయిదా ‘చట్టం’ జరిగింది. ఇది ఒక సార్థకమైన విజయం, భవిష్యత్తు ఆశావహం. గాంధీ శతజయంతి వత్సరమైన ఈ యేడు (1969) హైందవలెల్లరకూ ఒకే సమాన అనుష్ఠాన ప్రక్రియా ‘స్మృతి’ని రూపొందించ సంకల్పించి, అందుకోసం నమ్మేళనాలనూ, సమావేశాలనూ ఏర్పరుస్తూ విశ్వహిందూ పరిషత్ హైందవ భవితవ్య మహావైభవ సందర్శన కృషికి, మహాయత్నానికి అంకితం కావటం మన విధి. హిందూ సంఘటన ద్వారానే దేశంలో జాతీయైక్యత, సంఘటన సాధ్యం, ఒత్తిడులవల్లగాని, బలవంతాలవలనగాని, మోసం తోగాని, ప్రలోభాల కారణంగాగాని అన్య మతాలలోకి మార్పిడి చేసిన ఆది హిందువులందరూ తిరిగి హిందూ ధర్మ పథంలోకి తీసుకురావడం తక్షణావసరం.

అనిబీసెంటు మాటలలో…. హైందవం వినా భారతదేశానికి భవిష్యత్తు లేదు. భారతీయ తత్త్వ మూలాలు హైందవ ధర్మంలో పాదుకొని ఉన్నాయి. ఆ ధర్మం నుంచి భారతీయ జీవన విధానాన్ని పెకలించడం అంటే.. ఒక చెట్టును స్వస్థానం నుంచి పెకలించడమే. అదే జరిగితే ఈ భారతీయ జీవన వటవృక్షం వసివాడి పోవటం తప్పనిసరి, భారత దేశంలో భద్రంగా మన్నుతున్న ఇంకా అనేక మతా లున్నాయి. అయితే ఏ ఇతర మత ధర్మం గూడా భారతీయ స్వాస్థ్యానికీ, భారతీయతకు అగత్య మయినది కాదు. ప్రతి ఒక ఇతర మతధర్మము, వ్యక్తీ నశించుగాక కాని హిందూ దేశం ఇంకా నిలిచే ఉంటుంది. కాని హైందవం అదృశ్యమైతే ‘హిందూ దేశం’ ఏమిటి? దాని చరిత్ర, సారస్వతం, కళా వైభవం, దాని దివ్యస్మృతి చిహ్నాలు అన్నీ ‘హైందవ’ వెన్నెముకగా రూపొందినవే! హైందవ ఛాయలు కలిగి ఉన్నవే! ప్రపంచంలోని అన్ని ఇతర దేశాలూ పుట్ట టానికి ముందే హిందూ దేశం పుట్టి ఉంది. అవన్నీ అంతరించినా హిందూ దేశం నిలిచే ఉంటుంది. కాని హైందవం అంతరిస్తే?… అది హిందూ దేశ శిశువుకు ఊయెలే!? దాని అంతంలో హిందూదేశ సమాధి! (పాపం శమించుగాక) అప్పుడు హిందూ దేశం ఎంతోకాలం “జాతి”గా నిలవదు! నిలవలేదు.”