News

రాయచోటిలో హిందువులపై దాడి

447views

హిందువులపై, హిందువుల పండుగలపై ఎడారిమత ఛాందసవాదులు దాడులకు తెగబడడం నిత్యకృత్యమైంది.రాష్ట్రంలో హిందువులు తరచుగా దాడులకు గురవుతున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా హిందూ భక్తులు నిర్వహించుకుంటున్న ఊరేగింపుపై కృష్ణా జిల్లా పెడనలోని ముస్లిం వర్గీయులు రాళ్ల దాడి చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్పభక్తులతో వెళ్తున్న బస్సు పై ఇస్లామిక్ మతోన్మాదులు రాళ్లతో దాడి జరిపారు. ఇది మర్చిపోకముందే మరో దాడికి తెగబడ్డారు.

రాయచోటి పట్టణంలో వీరభద్రస్వామి ఉత్సవాలను ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ ఏడు సైతం బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తుది అంకంగా నిర్వహించే పార్వేట మహోత్సవం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇందుకు కారణం ముస్లిం మతోన్మాదులే. పార్వేటలో భాగంగా హిందూ భక్తులు ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీ ఎంతో ప్రశాంతంగా, భక్తిపూర్వకంగా కొనసాగుతూ పట్టణంలోని జామియా మసీద్ వద్దకు చేరింది. అలా చేరిన ర్యాలీపై ముస్లిం యువకులు అవాక్కులు చవాక్కులు పేలారు. స్థానిక ముస్లిం యువకులు ఆవేశంతో, ఆగ్రహంతో ర్యాలీపై కేకలు వేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఓ వైపు పోలీసులు మరోవైపు హిందువుల సంయమనంతో వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఏదిఏమైనా, రంజాన్ మాసంలో ఎంతో శాంతియుతంగా ఉంటామని చెప్పుకునే ముస్లింలు ఇలా దాడికి దిగడం ఎంతో ఆశ్చర్యంతో పాటు ఆవేదన కలిగిస్తోంది.