
గత కొద్దిరోజులుగా భారత సైన్యం సరిహద్దుల్లోనూ, పాకిస్థాన్ లోనూ తీవ్రవాదులపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ప్రేరిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం తుదముట్టించింది. దక్షిణ కశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో భారత భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఈ ముగ్గురు ముష్కరులు మృతి చెందినట్టు జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.
జాకీర్ ముసా వారసుడైన అబ్దుల్ హమీద్ లెల్హారీని కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. ‘అన్సర్ ఘజావత్ ఉల్ హింద్’ గ్రూప్ కు గత కొద్దిరోజులుగా అబ్దుల్ హమీద్ లీడర్ గా ఉన్నారు. జాకీర్ ముసాను భారత సైన్యం చంపేశాక ఆ గ్రూప్ కు అబ్దుల్ హమీద్ లీడర్ గా కొనసాగిన సంగతి తెలిసిందే. అన్సర్ ఘజావత్ ఉల్ హింద్ గ్రూప్ ను పూర్తిగా తుడిచిపెట్టేశామని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్ బోర్డర్ లో శిబిరాలను ఏర్పాటు చేసి తీవ్రవాదులను భారత్ లోకి చొచ్చుకొచ్చేలా చేస్తోందని ఆయన ఆరోపించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





