News

పురావస్తు శాఖ త్రవ్వకాలలో మహాభారత యుద్ధంలో వాడిన వస్తువులు లభ్యం.

1.1kviews

స్వాతంత్ర్యానంతరం 1951 –  52 సంవత్సరాలలో బి బి లాల్ అనే పరిశోధకుడు ఢిల్లీ సమీపంలోని హస్తినాపూర్, ఇంద్రప్రస్థ ప్రాంతాలలో తవ్వకాలు జరిపారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 900 – 1000 మధ్య జరిగినట్లు అంచనా వేశారు. కానీ గతేడాది  భారత పురావస్తు సంస్థ డైరెక్టర్ మంజుల్ నేతృత్వంలో ఒక బృందం ఢిల్లీకి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని సనౌలీ ప్రాంతంలో త్రవ్వకాలు జరిపింది. గుర్రంతో నడిపినట్టుగా భావిస్తున్న ఒక రథం, గుర్రాలను అదిలించే కొరడా, పిడి కత్తి, డాలు, బాణం, విల్లు, ఒక స్మశాన వాటిక, రక్షణ కవచాలు, పతాక ధ్వజం వంటివి లభించాయి. ఇవన్నీ మహాభారత సంస్కృతికి బాగా దగ్గరగా ఉన్నాయని మంజుల్ తెలిపారు. ఇక్కడ దొరికిన వర్ణ మృణ్మయ పాత్రలు, రాగి నాణేలను పరిశీలించిన అనంతరం అది క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరాల కిందటిదిగా అంచనా వేశారు. దాంతో మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 1500 – 2000 సంవత్సరాల మధ్య జరిగినట్లుగా మంజుల్ అంచనాకు వచ్చారు. అయితే… ఈ వాదనను బి బి లాల్ తోసిపుచ్చారు. ఇంద్రప్రస్థ, హస్తినాపురం గురించిన ప్రస్తావన మహాభారతంలో ఉన్నదని, కానీ సనౌలీ గురించి ప్రస్తావన మహాభారతంలో లేనేలేదని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.