News

బెంగాల్ హత్యలకు నిరనగా ధర్మ జాగరణ సమితి కొవ్వొత్తుల ర్యాలీ

143views

శ్చిమ బెంగాల్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ  ధర్మ జాగరణ సమితి సమితి ఆధ్వర్యంలో నంద్యాలలోని స్థానిక  వివేకనంద సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ జరిగింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షీదాబాద్ జిల్లా, జియా గంజ్ పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ (ఆర్ యస్ యస్) కార్యకర్త శ్రీ బందు ప్రకాష్ పాల్ గారిని, నిండు గర్భిణి అయిన వారి శ్రీమతిని, ముక్కు పచ్చలారని 6 సం||ల వారి అబ్బాయి ఆనంద్ పాల్ ను జిహాది మూకలు, తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు అత్యంత పాశవికంగా నరికి చంపడం ప్రజాస్వామ్య వాదులందరిని తీవ్రంగా కలచివేసింది.

ఇలాంటి ఆటవిక సంస్కృతికి వెన్నుదన్నుగా నిలిచిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణం బర్త్ రఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా ధర్మ జాగరణ సమితి విభాగ్ ప్రముఖ్ శ్రీ రాం ప్రసాద్ కోరారు.

డాక్టర్ ఉదయ శంకర్, శ్రీ అలవల సత్యనారాయణ, తదితర పట్టణ ప్రముఖులు, నాయకులు, ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.