News

పార్లమెంటులో ‘రామాయణం: ది లెజెండ్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ రామ’.. సినిమా ప్రదర్శన

223views

ది లెజెండ్‌ ఆఫ్ ప్రిన్స్ రామ చిత్రాన్ని ఫిబ్రవరి 15న పార్లమెంటులో ప్రదర్శించనున్నాం. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు సైతం దీనికి హాజరుకానున్నారు. ఇది మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని గీక్‌ పిక్చర్స్‌ ఇండియా సహ వ్యవస్థాపకులు అర్జున్ అగర్వాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

1993లో ‘రామాయణం: ది లెజెండ్‌ ఆఫ్ ప్రిన్స్ రామ’ యానిమేటెడ్‌ చిత్రాన్ని రూపొందించారు. 24వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియాలో దీన్ని ప్రదర్శించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు థియేటర్‌లలో ప్రదర్శించలేకపోయారు. 2000 సంవత్సరంలో టీవీలో దీన్ని టెలికాస్ట్‌ చేయగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. దీంతో దీని 4కే వెర్షన్‌ను సిద్ధం చేసి జనవరి 10న రిలీజ్‌ చేశారు. గీక్‌ పిక్చర్స్‌ఇండియా, ఏఏ ఫిల్మ్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. రామ్ మోహన్‌, యుగో సాకో దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్‌ చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ రైటర్‌గా వర్క్‌ చేశారు.