News

జాతీయ సమైక్యతా శిబిరానికి విద్యార్థిని ఎంపిక

258views

జాతీయ సమైక్యతా శిబిరానికి అనకాపల్లి జిల్లా చోడవరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని సవరాల వెంకటలక్ష్మి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ పి.కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 4 నుండి వారం రోజుల పాటు ఛండీగడ్‌ యూనివర్శిటీలో జాతీయ సమైక్యతా శిబిరం నిర్వహిస్తారని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికై న వలంటీర్లు ఈ శిబిరంలో పాల్గొని వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు చేస్తారని పేర్కొన్నారు. తమ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సర విద్యార్థిని వెంకటలక్ష్మి ఆంధ్రా యూనివర్శిటీ ప్రతినిధిగా ఎంపికైందని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు వి.రత్నభారతి, బి.పిచ్చమ్మ, డి.మాల్యాద్రి తెలిపారు. తమ కళాశాల నుంచి విద్యార్థినిని ఎంపిక చేసిన ఏయూ ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో ప్రొఫెసర్‌ ఎస్‌.హరినాఽథ్‌, డీపీఓ భాగ్యలక్ష్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.