News

అత్యవసరానికి వాటర్ అంబులెన్సు.. అండర్ వాటర్ డ్రోన్లు

148views

45 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమ స్థలిలో పవిత్ర స్నానాలు ఆచరించునున్న నేపథ్యంలో మహా కుంభమేళాకు వేదికగా అవతరించిన ప్రయాగ రాజ్ జిల్లా కట్టుదిట్టమైన భద్రతా చక్రవ్యూహంలో ఉంది. 1,000 మందికి పైగా పోలీసులు ప్రయాగ్ జిల్లాను పొరుగు జిల్లాలకు కలిపే ఏడు రూట్లలో 102 చెక్ పాయింట్ల వద్ద మోహరించారు. ఐదు వజ్ర వాహనాలు, డ్రోన్లు, అండర్వాటర్డ్రోన్లు, 2,700 కృత్రిమ మేథ ఏఐ ఆధారిత కెమెరాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిత్యం పహరా కాస్తున్నాయి. కుంభమేళాలో తొలిసారి అన్నట్టుగా
వాటర్ అంబులెన్సును త్రివేణి సంగమం పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సు నీటిపై తేలియాడే ఆస్పత్రి, జాతీయ వివత్తు నిర్వహణ బలగం-ఎన్డీఆర్ఎఫ్ వాటర్ అంబులెన్సును సమకూర్చింది. ఆక్సిజన్ సిలిండర్లు, ఎమర్జెన్సీ మందులు, మానిటర్లు, ఇతర వైద్య అత్యవసరాలతో పాటుగా వైద్యులు, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు ఈ అంబులెన్సులో నిత్యం అందుబాటులో ఉంటారు. అవసరార్థులకు అత్యంత వేగంగా ప్రాథమిక చికిత్స, తదితర వైద్య సేవలను వాటర్ అంబులెన్సు అందిస్తుందని, కుంభమేళా సంపూర్ణమైన తర్వాత వారణాసిలోని ఎన్డీఆర్ఎఫ్ సెంటర్ వద్ద అంబు లెన్సును ఉంచుతా మని ఎన్టీఆర్ఎఫ్ డీఐజీ మనోజ్ శర్మ తెలిపారు.