News

శివలింగాన్ని కాలితో తొక్కి వీడియో తీసిన ఇమ్రాన్ అరెస్ట్

235views

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఇవాళ ఇమ్రాన్ సూఖా అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు. హిందువులు పూజించే శివ భగవానుణ్ణి అవమానిస్తూ శివలింగంపై కాలుమోపి నిలుచుని వీడియో తీసాడు ఇమ్రాన్. తన ఘనకార్యాన్ని చూడాలంటూ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు. పోలీసులు అతన్ని ట్రాక్ చేసి అరెస్ట్ చేసారు.

ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటు చేసుకుంది. ఇమ్రాన్ తీసిన వీడియో బైటకు రావడంతో హిందువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ దైవాన్ని అవమానించిన ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేసారు.

ఇమ్రాన్ ఆ వీడియోను చిత్రీకరించాడు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి, వైరల్ చేసాడు. విషయం తెలిసిన బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు స్టేషన్‌రోడ్ పీఎస్‌లో ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.

రత్లాం పట్టణంలోని పోలీ గ్రౌండ్ దగ్గర ఇమ్రాన్ ఆ వీడియో తీసాడని హిందూ సంస్థలు పోలీసులకు తెలిపాయి. సూఖా మహరాజ్ అనే ఇన్‌స్టా ఐడీలో అప్‌లోడ్ చేసాడని వివరించాయి. ఆ రీల్ స్క్రీన్‌షాట్ తీసి పోలీసులకు సమర్పించారు. దాంతో పోలీసులు చర్య తీసుకున్నారు.

మహావీర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసామని పోలీసులు చెప్పారు. హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిన ఇమ్రాన్ సూఖాను ఇవాళ అరెస్ట్ చేసారు. ఇమ్రాన్‌కు నేరచరిత్ర ఉందని, అతనిపై గతంలోనూ చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయనీ పోలీసులు వివరించారు.