News

చెన్నైలో NT, SNT, DNT వెల్ఫేర్ బోర్డు అవగాహనా సదస్సు

664views

చెన్నై నగరంలోని టీ నగర్ లో జాతీయ సంచారజాతుల అభివృద్ది మరియు సంక్షేమ బోర్డు  అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో చైర్మన్ శ్రీ బికు రాంజీ ఇధాతే పాల్గొని మార్గదర్శనం చేశారు. సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కోసం బోర్డు గతంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు, అలాగే భవిష్యత్తులో చేపట్ట దలచిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అలాగే సంచార జాతుల సంక్షేమం, అభివృద్ధి కోసం భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలను యోజన చేశారు.

గత నెలలో తెలంగాణలో ఇదే విధమైన సదస్సు నిర్వహించామని, ఇప్పుడు తమిళనాడుకు చెందిన సదస్సును చెన్నైలో నిర్వహించామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సదస్సు నిర్వహించాల్సి ఉన్నదని జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ దేవళ్ళ మల్లిఖార్జున తెలిపారు.

ఈ కార్యక్రమంలో AIDNT అభివృద్ది మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ డి. పహాడ్, ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు శ్రీ వెంకట్, ఉపాధ్యక్షుడు శ్రీ మహంకాళి శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర  ప్రదాన కార్యదర్శి శ్రీ కర్నే అబ్బులింగం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.