NewsProgramms

పారిశుధ్య కార్మికులకు సేవాభారతి సన్మానం

53views

హాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి సేవాభారతి ఆధ్వర్యంలో ఒంగోలులోని అంజయ్య రోడ్డులో గల ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుల సన్మాన సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాజపా నాయకులు, మాజీ జడ్పీ అధ్యక్షులు శ్రీ ఈదర హరిబాబు మాట్లాడుతూ వాల్మీకి లాంటి మహాకవి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణమని, ఆయన రచించిన రామాయణం జీవన విలువలకు ప్రతీక అని అన్నారు. కార్మికులు ఉండడంవల్లే మనందరం పరిశుభ్రమైన వాతావరణంలో జీవించగలుగుతున్నామని ఆయన అన్నారు.

దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ కూడా పరిసరాల పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను దేశ ప్రజలందరూ గుర్తించాలన్న ఉద్దేశ్యంతో ‘స్వచ్ఛభారత్’ నినాదాన్ని ఇచ్చారని, దానికి అనుగుణంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కృషిని సమాజం గుర్తించాలని అన్నారు.  పారిశుధ్య కార్మికులకు కూడా మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గౌరవం, జీతభత్యాలు ఇచ్చి వారి సేవల రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రకాశం విభాగ్ సేవా ప్రముఖ్ శ్రీ లక్ష్మీరాజు శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ కోలగట్ల వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మరియు నగర సేవా ప్రముఖులు శ్రీ కె.వి శేషగిరిరావు, శ్రీ జీవి భాస్కర్ రావు, రైస్ కళాశాల ప్రతినిధి ఇందులూరి ఆంజనేయులు, ఎస్ ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీ నారిపెద్ది గోపాలరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ్య పర్యవేక్షకుల ద్వారా ఎంపిక చేసిన కార్మికులను నిర్వాహకులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.