
అంతరించి పోతున్న సనాతన ధర్మ సౌరభాలు పునఃస్థాపితం చేసే విధంగా కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర ఆవాసంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకొని బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఆవాసంలోని చిన్నారుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సమీప సమాజంతో అనుసంధానమవుతూ ప్రముఖులను సోదర అన్యక్షేత్ర సభ్యులను, చిన్నారులను కలుపుకొని హిందువుల పండుగలు సాంప్రదాయ బద్ధంగా ఎలా జరుపుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం చేయడం జరిగింది.

ఈ తొమ్మిది రోజులు సాంప్రదాయ నృత్యాలు, హైందవ వీరుల ఏక పాత్రాభినయాలు, స్తోత్రాలు, భజనలు, కోలాటం, డప్పు వాయిద్యాలు, చెక్క భజన, యోగ ప్రదర్శనలు మున్నగు వాటితో పాటు ఆయా రోజుల్లో ఆయా మాతలకు ప్రీతి పాత్రమైన ప్రసాదాలతో సకల రుచుల సమ్మేళనంగా, కోలాహలంగా జరిగింది.
డాక్టర్ గెలివి సహదేవుడు అమ్మవారి వివిధ వేషధారణల ప్రాశస్త్యాన్ని హైందవ సమాజంలో స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని, బొమ్మల కొలువులోని మహనీయుల స్ఫూర్తి దాయకమైన ఘట్టాలను హాస్యస్ఫోరకంగా వివరించి అతిథులను, చిన్నారులను మంత్రముగ్ధులను చేశారు.

ముఖ్య అతిథులు శ్రీమతి కొల్లి సుజాత, శ్రీ కృష్ణారెడ్డి, శ్రీమతి మనోహరీ దేవి, డాక్టర్ బద్రీశ్, శ్రీమతి సుజాత, శ్రీ గోళ్ల సుదర్శన్ జ్యోతి వెలిగించి పూజ నిర్వహించారు.
ఆత్మీయ అతిథులుగా విభాగ సంఘ చాలక్ డాక్టర్ ఉదయ శంకర్, డాక్టర్ సత్య శివ సుందరి, శ్రీ వై యన్ శంకర్ రెడ్డి, వారి సతీమణి, శ్రీ వై యన్ విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీమతి వై యన్ సంధ్య, శ్రీ నరేంద్ర నాయుడు, శ్రీ రవి, శ్రీ వాసు, శ్రీ రాంప్రసాద్, శ్రీ చిలుకూరు రవి తదితర పరివార ఆత్మీయ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మాతృమిత్ర సభ్యులు శ్రీమతి జ్యోతి, శ్రీమతి సునంద, శ్రీమతి మాధవి, శ్రీమతి సరిత తదితరులు పాల్గొన్నారు.

ఈ తొమ్మిది రోజులు సంఘమిత్ర చిన్నారుల తోపాటు సంఘమిత్ర ఆత్మీయ పరివార సభ్యులు చిన్నారుల సాంస్కృతిక కళా ప్రదర్శనలను తిలకించి ప్రశంశించి, ప్రోత్సహించారు.
ఈ తొమ్మిది రోజులూ అన్నీ తామై కార్యక్రమాలు నిర్వహించిన కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ దంపతులను, శ్రీ సుందర్ రావు దంపతులను అవాస్ ప్రముఖ్ శ్రీ గంగాధర్ దంపతులను, శ్రీమతి విజయ శ్రీ, శ్రీమతి వెంకటేశ్వరిల కృషిని అతిథులు ఎంతగానో అభినందించారు.

ఈ సారి మరీ ముఖ్యంగా “కంకర్ కంకర్ మే శివ శంకర్ హై” అన్నట్లు ప్రకృతిలో పరమాత్ముని దర్శిస్తూ ప్రకృతిలో భాగంగా బ్రతకమని ప్రబోధించిన సనాతన ధర్మ ప్రభోదాన్ని పెడచెవిన బెట్టి ప్లాస్టిక్ భూతాన్ని మెడకు చుట్టుకుంటూ తమ ఉసురు తామే తీసుకుంటున్న మానవాళికి సందేశాన్ని అందించుటకు గాను శ్రీ సుందర్ రావు దంపతుల నేతృత్వంలో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు చూపిస్తూ ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రకటన ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అధ్యక్షులు శ్రీ నాగసుబ్బా రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ పాండే, కోశాధికారి శ్రీ నాగరాజు, శ్రీ అశోక్, శ్రీ మహేశ్వర రెడ్డి , శ్రీ రమణయ్య గారు, శ్రీ వెంకటయ్య తమ వంతు పాత్ర పోషించారు. అతిథులు ఈ తొమ్మిది రోజులూ ఆద్యంతం కార్యక్రమాలను వీక్షిస్తూ అవసరమైన చోట పాల్గొంటూ, ఎనలేన ఆనందాన్ని పొందారు.






