News

బయటపడిన మరో పురాతన రాత్రి విగ్రహం

275views

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ ఏటిగడ్డ పల్లె సమీపంలో పొలంలో కౌలు రైతు వెంకటేష్ పొలం ట్రాక్టర్ తో దుండుతుండగా రెండు దేవత విగ్రహాలు బయటపడి సంచలనం కాగా ఏకంగా మహావిష్ణువు అవతార పురుషుడి విగ్రహం బయటపడడంతో మండలంలో ఈ వార్త సంచలనంగా మారింది. మొన్న దొరికిన రెండు విగ్రహాల పొలంలో మరో మారు ట్రాక్టర్ తో స్థానిక కౌలు రైతులు దున్నుతుండగా శ్రీ మహావిష్ణువు రాత్రి విగ్రహం బయటపడింది. దీంతో కోటకొండ పంచాయతీ పరిధిలోని జనాలు తండోపతండాలుగా తరలివచ్చి స్వామివారి విగ్రహాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న తాసిల్దారు హరికుమార్, ఎస్ఐ లోకేష్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని బయటపడిన శ్రీ మహా విష్ణు విగ్రహాన్ని పరిశీలించారు.

రాతి విగ్రహాలు బయటపడిన పొలాన్ని ఎవరు దున్నరాదని ఆ కౌలు రైతులకు ఆదేశించారు. విగ్రహాలు లభించిన ప్రాంతంలో పురాతన ఆలయ అవశేషాలు ఉంటాయని ఇంకా పలు వివరాల పరిశీలన కోసం పురావస్తు శాఖ అధికారులకు పిలిపించి విగ్రహాల పరిశోధనతోపాటు ఆ ప్రాంతంలో పురాతన అవశేషాలను గుర్తించడానికి చర్యలు చేపడతామని తాసిల్దారు విలేకరులకు తెలిపారు. ఇలాంటి విగ్రహాలు బయటపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని తహసీల్దార్ ప్రజ లకు సూచించారు. సుమారు మూడు అడుగుల ఎత్తు గల శ్రీ మహా విష్ణు అవతార పురుషుడి రాతి విగ్రహం బయటపడిన విషయం తెలుసుకున్న మండలంలోని పలువురు కోటకొండ కు చేరుకొని స్వామివారి విగ్రహాన్ని దర్శించి తరలివస్తున్నారు. ఏదేమైనా పురావస్తు శాఖ అధికారులు నిశితంగా త్రవ్వకాలు జరిపితే పురాతన ఆలయ అవశేషాలు తోపాటు ఆ ప్రాంత విశిష్టత గురించి బయటపడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు.