News

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం

80views

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేయడం కోసం ఏకంగా.. గర్భగుడిలోనే సెట్ వేశారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి.. గర్భగుడిలో ప్రైవేట్‌ ఆల్బమ్‌ షూట్ చేశారు. గుడి తలుపులు మూసి గర్భగుడిలో చిత్రీకరణ చేయడంపై భక్తులు, స్థానికులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆలయంలో ఆల్బమ్‌ షూటింగ్‌ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తుండగా.. సదరు ఘటనను దేవాదాయ శాఖ( అధికారులు స్పందించక పోవడం మరిన్ని విమర్శలకు దారి తీసింది. దీంతో ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా నడుచుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.