News

దుర్గా నవరాత్రి ఉత్సవాలలో ఆర్. ఎస్.ఎస్ సూపర్ 20 బృందం శ్రమదానం

1kviews

చిత్తోఢ్ గఢ్ లోని దుర్గా స్థితి కాళికా మాత మందిరం లో  ఆర్. ఎస్.ఎస్ సూపర్ 20 కార్యకర్తల బృందం వ్యర్ధాలను ఏరి మందిర పరిసరాలను శుభ్రపరచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటారు. పర్యావరణ, జల పరిరక్షణను అత్యంత ఆవశ్యకమైన గతివిధిగా ఆర్.ఎస్.ఎస్ స్వీకరించింది. దేశవ్యాప్తంగా పర్యావరణ, జల పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ ఆర్. ఎస్.ఎస్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో చిత్తోఢ్ గఢ్ కు చెందిన ఆర్. ఎస్.ఎస్ కార్యకర్తలు దుర్గా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పర్యావరణ, పరిసరాల శుభ్రత, జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి వినూత్న రీతిలో ప్రయత్నించారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై అందరినీ ఆ దిశగా ఆలోచించేలా చేస్తోంది.

దశరా నవరాత్రి ఉత్సవాలు మొదలు కావటానికి కేవలం ఒక రోజు ముందు సోషల్ మీడియాలో సూపర్ 20 పేరుతో ఒక సమూహాన్ని రూపొందించి కార్యకర్తలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక కాళికా మాత మందిర పరిసరాలను శుభ్రం చేయడానికి తరలి రాయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ పిలుపు అందుకున్న కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. మందిర పరిసరాలలో ప్రసాద స్వీకరణ, తాగు నీరు మరియు ఇతర కారణాల వల్ల పెరుకొనే చెత్తను, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరి మందిర పరిసరాలను శుభ్రం చేశారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే అన్నిరోజులు రోజుకి 3,4 గంటల పాటు శ్రమదానం చేయటం ద్వారా మందిర పరిసరాలను శుభ్రం చేస్తామని సూపర్ 20 బృందం కార్యకర్తలు తెలిపారు. అంతే కాకుండా నవరాత్రుల అనంతరం కూడా వారానికి ఒకరోజు 3,4 గంటల పాటు నగరాన్ని శుభ్రం చేయడానికి పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ ఆవశ్యకతను ప్రజలకు వివరించడానికి తామంతా నిర్ణయంచుకున్నామని తెలిపారు. మందిర పరిసరాల్లో కూడా అక్కడక్కడా చెత్త బుట్టలు ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు వీలయినంత వరకు వ్యర్ధాలను చెత్త బుట్టలలోనే వేయాలని, నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆర్. ఎస్.ఎస్ సూపర్ 20 బృందం భక్తులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. మొత్తానికి చిత్తోఢ్ గఢ్ సంఘ కార్యకర్తల ఆలోచన దేశంలోని పర్యావరణ ప్రేమికులు, ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలకు ప్రేరణగా నిలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.