‘ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అన్యాయం అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయను వెంటనే విడుదల చేయాలి. లేదంటే బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హెచ్చరికలు జారీ చేశారు.
ప్రార్ధనా మందిరాల్లో దాడులు, ఘర్షణలు, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ పాలనపై షేక్ హసీనా స్పందించారు. ఓ స్టేట్మెంట్‌ను విడుదల చేశారు. అందులో.. ఆర్థిక వ్యవస్థ, శాంతిభద్రతలను నిర్వహించడంలో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
‘నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రణ, ప్రజల జీవితాలకు భద్రత కల్పించడంలో ప్రస్తుత యూనిస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’.
కృష్ణదాస్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. హింసాత్మకంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణించినట్లు చిట్టగాంగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీమ్ ఉద్దిన్ చౌదరి తెలిపారు. న్యాయ వాది మరణంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు. నిందితుల్ని శిక్షించడంలో మధ్యంతర ప్రభుత్వం విఫలమైతే మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవలని ఉంటుందని హెచ్చరించారు.
చిట్టగాంగ్‌లో ఒక న్యాయవాది హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పాల్పడిన నేరస్తుల్ని వెంటనే శిక్షించాలి. ఈ రకమైన దేశ ఉనికిని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న సంఘ విద్రోహ శక్తులపై ఐక్యంగా పోరాడాలని బంగ్లాదేశ్ ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు.