News

సంభాల్‌ నిరసనకారుల నుంచే నష్టపరిహారం వసూలు

54views

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సంభాల్‌ అల్లర్లలో ప్రమేయం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఆ రోజు ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన నష్టానికి నిరసనకారుల నుంచి పరిహారం వసూలు చేయాలని నిర్ణయించింది. రాళ్లు రువ్విన వారి పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించనుంది. వారికి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషికం అందజేయనుంది. సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అల్లర్లలో నలుగురు మరణించగా, పోలీసు సిబ్బంది సహా అనేకమంది గాయపడ్డారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2020లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనల్లో విధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల ఫొటోలను కూడా ఇలాగే బహిరంగ ప్రదేశాల్లో అంటించింది. అయితే వాటిని కోర్టు ఆదేశాలతో తొలగించింది.