
315views
పాలస్తీనాలో ముస్లింలపై ఏదైనా జరిగితే స్పందించే మేధావులు, వామపక్షాల నేతలూ బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రధానితో భేటీ అనంతరం దేశ రాజధానిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అని గుర్తుచేసారు.భారతదేశంలో మైనారిటీలను ఎలా చూస్తున్నాం? బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.





