News

పశువుల అక్రమ రవాణా అడ్డగింత

170views

శ్రీకాకుళం జాతీయ రహదారిపై పశువుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.జిల్లాలోని నరసన్నపేట మండలంలోని మడపాం టోల్‌గేట్‌ వద్ద వివిధ వాహనాల్లో తరలిస్తున్న 74 పశువులను పట్టుకున్నారు. వీటిని కొత్తవలస గోశాలకు తరలించారు. ఐదు బొలేరో లగేజీ వాహనాలతో పాటు ఒక కంటైనర్‌లో పశువులను తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో శ్రీకాకుళం టాస్క్‌పోర్సు పోలీసులు సోమవారం వేకువజామునే కాపుకాశారు. దీనిలో భాగంగా వచ్చిన వాహనాలను తనిఖీ చేశారు. కంటైనర్‌లో 40 పశువులు, ఐదు బొలేరో వాహనాల్లో 34 పశువులు గుర్తించారు. వీటిని నరసన్నపేట పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేశామని, వాహనాల్లో ఉన్న 15 మందిని అరెస్టు చేశామని ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.