
327views
కార్తికమాసం సందర్భంగా పంచారామాలు దర్శించుకునే భక్తులకు పంచారామ దర్శని ప్యాకేజీతో ఒకేరోజు ఐదు పంచారామ క్షేత్రాలు దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు పశ్చిమగోదావరిజిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్ వి ఆర్. వరప్రసాద్ చెప్పారు. భీమవరంలో వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం డిపో నుంచి ఎక్ ప్రెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులను ఆదివారం రాత్రి బయలుదేరి సోమవారం రాత్రికి అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం పంచారామాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటు శ్రీశైలం, శబరిమలై క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.





