News

ఆధునికత పేరుతో ఆచారాలు వదలొద్దు

185views

ప్రస్తుత సమాజంలో ఆధునికత పేరుతో ఆచార, సంప్రదాయాలను వదిలిపెడుతున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచర కర్త డాక్టర్‌ గరికపాటి నరసింహారావు అన్నారు.తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలోని స్థానిక నవదుర్గ, శ్రీచక్ర సహిత కనకదుర్గమ్మ ఆలయంలో మహ కుంభాభిషేకం శత చండీ యాగం మహోత్సవాల్లో భాగంగా ఆమర ప్రవచన కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ అహంకారం ఉండరాదని, ఉన్న దానితోనే సంతృప్తి చెందాలన్నారు. పిల్లలను సరైన మార్గంలో పెంచాలని హితవు పలికారు. ప్రతి వ్యక్తిలో దైవం ఉన్నాడని చెప్పిన ఏకైక మతం హిందూ మతమని చెప్పారు. ఆధ్యాత్మిక యాత్రలు చేయడం కాదని, మనలో మార్పు రావాలన్నారు. ఆనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయనను సత్కరించారు.